Veturi Sundararama Murthy(29 January 1936 - 22 May 2010) Poet... Lyricist... Song Writer..!
Legendary film lyricist Veturi Sundara Rama Murthy passed away this evening at Care Hospitals, Hyderabad. He entered film industry with the film ‘O Seetha Katha’ and his last song is written for ‘Dhana Dhan’ for Lagadapati Sridhar’s banner, Larsco. Veturi, the scholar lyricist was born on 26th January 1936 in Krishna District. His native place is Peda Muthhevi. Greatandhra.com expresses deepest condolences to the family of the emperor of Telugu Lyrics.He was 74. He was ailing for sometime now and was rushed to a corporate hospital in the night after he complained of chest pain and he died of cardiac arrest in the hospital, sources close to his family said.
Born at Peda Kallepalli village in Krishna district on January 29, 1936, Veturi began his career as a journalist in Andhra Prabha and Andhra Patrika Telugu dailies.
He was a disciple of famous Telugu writer Viswanadha Satyanarayana.
Legendary Telugu actor N T Rama Rao was the first to recognise Veturi's writing talent and introduced him to the film industry.
He penned the songs for NTR's blockbuster movie 'Adavi Ramudu' and shot into fame instantly. Prior to joining the film industry, Veturi penned many short stories, ballets and poems for All India Radio.
Veturi's songs in films like 'Sankarabharanam' and 'Sagara Sangamam' by ace director K Viswanadh won him national acclaim.
He won the National award for best song for 'Raalipoyye Puvva Neeku Raagalenduke' from 'Matrudevobhava'. He won eight Nandi awards, instituted by the state government, as best lyricist.
Veturi also essayed brief roles in a few films. Andhra Pradesh Chief Minister K Rosaiah, Telugu Desam Party president N Chandrababu Naidu and Praja Rajyam Party and actor K Chiranjeevi were among those who condoled his death.
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
ఉత్తమ సాహితీ సుగంధాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించి అర్చిస్తున్నసారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి---శ్రీ వేటూరి సుందరరామ మూర్తి తెలుగు పాటకే తెనుగు నేర్పించిన ఘనుడు---మనం అభిమానం గా పిలుచుకునే వేటూరి .
జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది గారివద్ద, శిష్యరికం చేసారు. తొలినాళ్ళలో పాత్రికేయినిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. తర్వాత కొన్ని వేల పాటలను రాసారు.
సినీ ప్రస్థానం:
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు.
ఎంత గంగానది అయినా చిన్న పాయ గానే మొదలవుతుంది. ప్రవహిస్తూ ప్రవహిస్తూ వేగాన్నీ, విస్తారాన్నీచేరుకుంటుంది. ఇదే సూత్రం రచయితలకీ వర్తిస్తుంది. వేటూరి సుందర రామ మూర్తి అన్నా పేరు వినగానే ఎవరికీ వారుతమ హృదయ సంస్కారాన్ని బట్టి, జ్ఞ్యాపక శక్తిని బట్టి, అభిరుచిని బట్టి ఎన్నో వేళ పాటల్లో వందల గీతాలనుగుర్తుచేసుకొంటారు. "సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతామాలచ్చి యంటే శ్రీ లక్ష్మి అవతారం..." చిన్న చిన్నమాటలతో ఔరా అనిపించినా ఆ కలం రసగుళికలు విన్న చాగంటి సోమయాజులు వంటి వారు - "అబ్బో.... ఇంకోపాతికేళ్ళు ఇతగాడు ఏలుతాడు...." అన్నారట! అదే నిజమయింది. ఆయన ప్రవేశంతో ఆనాటి సీనియర్లందరూ తమపాళీలు మూసేయక తప్పింది కాదు. భక్తి, ముక్తి, రక్తి, శృంగారం, వేదాంతము, జానపదం.... ఇలా ఒకటేమిటి ఆ కలానికిఎదురే లేకుండా పోయింది.
"వేటూరి వారి పాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరే నంది నవ్వి- వెంకట రమణా"
స్వయంగా ముళ్ళపూడి పలికించిన 'కంద'మిది. ఇంక ఆ పాటేశ్వరునికి సమ వుజ్జీ వేటూరి కాక మరెవరు?
వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” “ఉఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం.
శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే"... అనే పాటకి జాతీయ పురస్కారం వచ్చింది. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు బాషకు ప్రాచీన బాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ బాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
చిలిపితనానికి మారుపేరు వేటురి!!ఆయన వ్రాసిన పాటల్లో క్రొత్త తెలుగు పదాలను పరిచయం చేసి తెలుగు పాటను ప్రయోగాల పుంతలు తొక్కించారు అనటం లో అతిశయోక్తి లేదు.ఆయన వయను పెరిగినా మనసు ఇంకా నిత్య నూతన యవ్వనం లోనే ఉంది అని నిన్న మొన్నటి యమునా తీరం తో మళ్ళీ నిరూపించారు వేటురి.
ఈ పాటల విరించి తలపున మరెన్నో అందమయిన భావాలు పాటలుగా ప్రభవించాలని, అవి మనకు వినిపించాలని కోరుకుంటూ -------------
ఎందరో మహానుభావులు ....... అందరికీ వందనములు !!